టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లో పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది.
ఈ సీజన్ మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఈవారం హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ కి గురి చేసింది.
దీనికి మెయిన్ రీజన్ ఆయన హౌస్ లో అందరితో కలిసి ఉండటమే అంటున్నారు జనాలు. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లనే హౌస్ లో ఉంచుతారు. అందరూ నా వాళ్ళు అందరు నా మనుషులు అనుకుంటూ ఉండేవాడు చంటి.
దీంతో చంటి ఇక హౌస్ లో పనికిరాడు అంటూ ఎలిమినేట్ చేసేసారు. అయితే చంటి వారానికి 2 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ విధంగా చంటి 5 వారాలకు 10 లక్షల పారితోషకం పుచ్చుకున్నాడని తెలుస్తుంది. ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ హౌస్ లో ఖాళీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు.. మనకి కంటెంట్ ఇవ్వట్లేదు అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది.