Chalo Warangal Meeting: విజయవంతమైన ఛలో వరంగల్ సభ.. తక్షణమే PRC అమలు చేయాలంటున్న విధ్యుత్ కార్మికులు
విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకు PRC తో పాటు తమ న్యాయమైన 23 డిమాండ్లు తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ తో తలపెట్టిన చలో వరంగల్ సభ విజయవంతమైంది.రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది విధ్యుత్ కార్మికుల రాకతో వరంగల్ లోని విధ్యుత్ ప్రధాన కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరి పట్ల కార్మికులు వరంగల్ లోని విధ్యుత్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు..
ఈ సందర్బంగా ఆర్టిజన్ ఉద్యోగులు మాట్లాడుతూ,విధ్యుత్ సంస్థలో అనేక ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న మమ్మల్ని సియం కేసీయార్ గారు 2017 లో పర్మినెంట్ చేస్తున్నాం అని ప్రకటించి, ఆ తరువాత ఆర్టిజన్ అని పేరు పెట్టి మోసం చేశారు అని, ఉద్యోగులతో పాటు సమానంగా రావాల్సిన జీతంతో పాటు సదుపాయాల్లో వివక్ష చూపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 25,000 జీతం మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు అని, కొత్త PRC కూడా సంవత్సరం నుండి అమలు చేయకుండా కార్మికుల పొట్ట కొడుతున్నారు అని మండిపడ్డారు. ఇకనైనా ఈ నెలాఖరు లోగా యాజమాన్యం కళ్ళు తెరచి PRC తో పాటు, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి అన్ని సదుపాయాలు కల్పించాలని, లేనిపక్షంలో తదుపరి పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని యాజమాన్యాన్ని హెచ్చరించారు