Chandrababu in Jail : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదిగా ఉన్నారు. అయితే ఆయన మొదటి రోజు జైలు జీవితం ఎలా గడిచింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టిడిపి అధినేత అయినటువంటి చంద్రబాబు ఇలా జైలుకు వెళ్లడం అందరీ నీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.
అందరి నోళ్ళల్లో శనివారం నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది. అందరూ చంద్రబాబుకి బెయిల్ వస్తుందని ఆశించారు. కానీ ఆశలు ఫలించలేదు. చంద్రబాబుకి బెయిల్ మంజూరు కాలేదు. ఆయన తరుపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లుద్రా కేసును వాదిస్తున్నప్పటికీ బెయిల్ రాకపోవడం కాస్త విచిత్రమే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు మొదటిరోజు ఎలా గడిచింది అంటే..

ఆయన ఆదివారం రాత్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. మొదట కాస్త ఇబ్బంది పడిన బాబు సోమవారం పొద్దున్నే ఐదు గంటలకు నిద్ర లేచి మామూలుగా తన కార్యక్రమాలను తీర్చుకున్నారు. తర్వాత ఐదుగురు భద్రతా సిబ్బందితో కలిసి ఆయన వాకింగ్ చేసినట్టు సమాచారం. అరగంటసేపు వాకింగ్ చేసిన చంద్రబాబు ఆ తరువాత తన గదికి వచ్చి యోగాసనాలు వేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచి వెళ్లిన అల్పాహారాన్ని తిని రెస్ట్ తీసుకున్నారని జైలు అధికారులు వెల్లడించారు.
