Chhattisgarh : అమానుషం..17 ఏళ్ల బాలికని రోడ్డుపై ఈడ్చుకెల్లి…
దేశంలో మహిళలపై ప్రేమ, పెళ్లి అని జరుగుతున్న దాడులకి అడ్డు అదుపు లేకుండా పోతుంది..నిత్యం నిరాటంఖం గా అకృత్యాలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయ్..
తాజాగా చత్తిస్ ఘడ్ లోని రాయపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది.
ఓ 17 ఏళ్ల బాలికపై 47 సంవత్సరాల వయసు కలిగిన మనోజ్ అనే వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
గతంలో తన షాప్ లోనే పనిచేసిన ఆ బాలికని.. ఈ మధ్య తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు మనోజ్. దీనితో బాలిక.. బాలిక తల్లి పెళ్ళికి ఒప్పుకోక నిరాకరిస్తూ వస్తున్నారు.
దీనితో కోపం పెంచుకున్న నిందితుడు అదును చూసి రోడ్డుపై వెళుతున్న ఆ బాలికని అందరూ చూస్తుండగానే దారుణంగా ఆమెపై గత రాత్రి దాడి చేశాడు.
నిందితుడు ని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి కటకటాల పాలుజేసిన పోలీసులు బాలికని వైద్యం కొరకు ఆసుపత్రిలో చేర్పించారు