అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి పూర్తిగా దళిత వ్యతిరేకులని టిడిపి నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ లో రెండు కోణాలు ఉంటాయని, అందరికీ కనిపించే కోణంలో దళితులను అపారంగా ప్రేమించే వ్యక్తి గా నటిస్తారు కానీ.. ఆయనలో లోపలి మనిషి పూర్తిగా దళిత వ్యతిరేకి అని, దళితుల అభ్యున్నతికి ఏమాత్రం కోరుకోని వ్యక్తి, దళితులను కించపరుస్తూ మాట్లాడతారని దళితులు అసమర్ధులు అనే అభిప్రాయంలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి సలహాదారులుగా మాత్రం ఒక్క దళితుడు కూడా పెట్టుకోలేదని ఇది దళితులకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత అని దళిత సోదరులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.
ప్రజల సొమ్ముతో ప్రకటనలు తీసుకునే సాక్షి పత్రిక ప్రజలలో భాగమైన దళితుల గురించి ఎందుకు రాయరు అని ఆయన ప్రశ్నించారు.
