Chigurupati Jayaram Murder Case :వ్యాపారవేత్త జయరాం కేసులో తుదితీర్పు… నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురపాటి జయరాం హత్య కేసులో తుదితీర్పు వెలువడింది. ఈ కేసులో దోషి అయిన రాకేష్ రెడ్డికి నాంపల్లి కోర్ట్ తాజాగా జీవిత ఖైదు విధించింది. ఇటీవలే న్యాయస్థానం రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.
2019 జనవరి 31 వ తేదీన జయరామ్ ని హనీ ట్రాప్ చేసిన రాకేష్ రెడ్డి, తన ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని కృష్ణా జిల్లా నందిగామ వద్ద సమీపంలోని ఐతవరం వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక సమాచారాన్ని, ఆధారాలని సేకరించి నిండుతుడిపై 23 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసి 73 మంది సాక్షులని విచారించింది. అయితే కేసులో 12 మంది నిందితులని చేర్చగా, మిగతా 11 మందిని నిర్దోషులుగా తేల్చింది.
అయితే జయరాం ని రాకేష్ రెడ్డే దారుణంగా హత్య చేసినట్లు అప్పటి బంజారా హిల్స్ ఏసీపీ కేఎస్ రావు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలు కూడా ఈ కేసులో కీలకంగా మారడంతో నిండుతుడికి శిక్ష పడింది.మొత్తం రాకేష్ రెడ్డిపై 8 సెక్షన్ ల కింద కేసు నమోదు అవగా, ఇందులో 3 సెక్షన్ ల కింద తుది తీర్పు ఇచ్చారు.