Children’s Health : పిల్లలు ఉట్టి పాలు తాగడానికి చాలా మారం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడగ్గానే ఏదో ఒకటి పిల్లలకి పాలతో పాటు తినడానికి ఇచ్చేస్తారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదమని అంటున్నారు నిపుణులు. ఏయే పదార్థాలను పాలతో కలిపి ఇవ్వకూడదు ఇప్పుడు చూద్దాం..
ఉప్పగా ఉండే స్నాక్స్..
పిల్లలకు పాలతో పాటు ఉప్పగా ఉండే చిప్స్ వంటి స్నాక్స్ అస్సలు ఇవ్వకూడదు. ఉప్పుతో ఉన్న ఇలాంటి చిరుతిల్లు పిల్లలకు పెడితే పిల్లల్లో డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. వీటి స్థానంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక గ్లాసు నీరు, పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని పెట్టవచ్చు.
సిట్రస్ పండ్లు.
నారింజ మరియు నిమ్మకాయలు ఇలాంటి సిట్రస్ పండ్లలో ఎక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ వలన పాలలోని ప్రోటీన్లు పెరుగుతాయి. అలాంటప్పుడు పిల్లలకు జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
ద్రాక్ష పండ్లు..
ద్రాక్షతో పాటు ఇంకేదైన చిరుతిండిని తినాలనుకుంటే, ఆ గంటలో పాలు తీసుకోకుండా ఉండటం మంచిది. పాలలో ఉండే ప్రోటీన్, ద్రాక్ష పళ్ళల్లో ఉండే ఆమ్ల స్వభావం, వాటిలో ఉన్న విటమిన్ సి తో సమస్యలు వస్తాయి. ఈ రెండింటి పరస్పర చర్య జీర్ణశయాంతర ఇబ్బంది, కడుపు నొప్పి, విరేచనాలకు కూడా కారణం అవుతుంది.
పుచ్చకాయలు..
పాలు అనేవి ప్రోటీన్ కోవ్వుతో నిండి ఉంటాయి, ఇలాంటి పాలను పుచ్చకాయలాంటి వాటితో కలిపి ఇవ్వకూడదు. పుచ్చకాయలో ఉండే యాసిడ్ పాలలోని ప్రోటీన్‌ను కలిస్తే ఇబ్బంది అవుతుంది. ఇది జీర్ణ అసౌకర్యం, ఇతర సమస్యలను దారి తీస్తుంది. పాలు, పుచ్చకాయ రెండు కలిపి ఒకే టైం లో అస్సలు పిల్లలకు పెట్టకూడదు.