ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలకి లేనాన్ని సినిమాలు బడా ప్రాజెక్టులు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ చేతిలోనే ఉన్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమాని చేసిన తర్వాత మరొక సినిమాని మాత్రమే చేస్తున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. మరోవైపు చిరంజీవికి ఇప్పటికీ పలు డైరెక్టర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
అందులో నచ్చిన సినిమాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తాజాగా తన “గాడ్ ఫాదర్” సినిమా ప్రమోషన్స్ లో కూడా పూరీ జగన్నాథ్ తో ఒక ఇంటర్వ్యూ చేశారు. గతంలో మెగాస్టార్ తో పాటు ఆటో జానీ అనే సినిమా కథను రాసుకున్నానని పూరి చెప్పగా తాను రాసుకున్న ఆటో జానీ స్క్రిప్ట్ ని మళ్లీ ఒకసారి తనకి వినిపించమని అడిగారు చిరంజీవి. అలాగే మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కి కూడా ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారు చిరు.
Also Read : గాడ్ ఫాదర్ లో సత్య దేవ్ పాత్రను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోలు ఎవరో తెలుసా..!?
“మీలాంటి డైరెక్టర్లు మంచి కథ దొరికితే తప్ప నన్ను అప్రోచ్ అవ్వరు. కానీ మీరైనా ఒక ముందు అడుగు వేస్తే తర్వాత కథలు అవే పూర్తవుతాయి. మీ డైరెక్షన్ లో పని చేయాలని ఉంది,” అని చిరంజీవి కృష్ణవంశీ తో చెప్పటం అభిమానులను సైతం షాక్ కి గురిచేసింది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న ఈ ఇద్దరు డైరెక్టర్ల కెరీర్ ఏమాత్రం బాగాలేదు. ఈ సమయంలో ఒక్కసారి మెగాస్టార్ చిరు తో బ్లాక్ బస్టర్ పడితే కచ్చితంగా మారుతుందని చెప్పవచ్చు.