Mana Shankara Varaprasad Garu: ఫైట్ సీక్వెన్స్‌లో మన శంకర వర ప్రసాద్‌గారు.. షూటింగ్ కంప్లీట్!
Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణ జరుపుకుంటోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ తాజాగా సినీ వర్గాల నుంచి బయటకు వచ్చింది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి బృందం చిరంజీవిపై ఓ యాక్షన్ ప్యాక్డ్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ సన్నివేశాల షూటింగ్ నేడు ఫిల్మ్ నగర్ గోల్ఫ్ కోర్ట్‌లో మొదలైనట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు ఈ షూటింగ్ కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌తో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని ఇన్‌సైడ్ టాక్. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం కానున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాట నెట్టింట్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ, ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ పాట విడుదలైన క్షణం నుంచే అభిమానుల్లో సినిమాపై ఉన్న ఆసక్తి అమాంతం పెరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్ మరియు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ రేవంత్ భీమల (బుల్లిరాజు) వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, మరియు మెగా డాటర్ సుస్మిత కొణిదెల–విష్ణు ప్రసాద్‌ల హోమ్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి స్టైల్‌తో కూడిన ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ మరింత బలంగా నిలవనుంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఖచ్చితమైన రిలీజ్ తేదీపై చిత్ర యూనిట్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావడంతో, సంక్రాంతి రేసులో ఈ సినిమా ప్రధానంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
