Chiranjeevi-Pawan: మెగాస్టార్, పవర్ స్టార్‌లు కలిసి ఒక సినిమా చేయాలి.. ఆర్జీవీ పోస్ట్ వైరల్
Chiranjeevi-Pawan:మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లను ఒకే సినిమాలో చూడాలని కోరుకుంటున్న అభిమానుల ఆశలకు మరింత బలం చేకూర్చేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలై 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కల్యాణ్ తన అన్నయ్యపై ప్రేమను, గౌరవాన్ని చూపుతూ చేసిన పోస్ట్‌ను ఆర్జీవీ షేర్ చేయడంతో ఈ చర్చకు తెర లేచింది.
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రమైన ‘ప్రాణం ఖరీదు’ విడుదలై 47 సంవత్సరాలు అయిన సందర్భంగా, పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పుట్టుకతోనే యోధుడని, ఆయనకు రిటైర్మెంట్ ఉండదని ప్రశంసించారు. ఆ పోస్ట్‌కు స్పందిస్తూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పోస్ట్‌ను తన ఎక్స్ ఖాతాలో రీషేర్ చేస్తూ మెగా అభిమానుల ఆశలను మరింత పెంచేశారు. “మీ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మెగా పవర్ జోష్ నింపుతుంది. ఈ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది” అని ఆర్జీవీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ తమ అభిప్రాయాలను కామెంట్స్‌లో పంచుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే విషయంపై కూడా నెటిజన్లు రకరకాల పేర్లను సూచిస్తున్నారు. ఈ వైరల్ పోస్ట్, మెగా అభిమానుల్లో ఈ కలయికపై ఉన్న ఆసక్తిని మరోసారి స్పష్టం చేసింది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్ నిజంగానే తెరకెక్కుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.