OG Movie: ‘ఓజీ’పై చిరంజీవి రివ్యూ.. థియేటర్‌లో రచ్చ చేసిన సాయిదుర్గ తేజ్
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిరకాల కోరికను నెరవేరుస్తూ, దర్శకుడు సుజీత్ రూపొందించిన ‘ఓజీ’ చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలైన మొదటి రోజే సినిమాపై అసాధారణమైన స్పందన లభించింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎప్పుడూ చూడాలనుకున్న గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతంగా చూపించారని ఫ్యాన్స్, విమర్శకులు ఏకగ్రీవంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల హర్షధ్వానాలతో థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఈ ‘ఓజీ మేనియా’ దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చిత్ర బృందాన్ని అభినందించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ‘ఓజస్ గంభీర’గా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, తమన్ అందించిన అద్భుతమైన సంగీతానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే తరహాలో ఇతర ప్రముఖ నటులు కూడా సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ “చెప్పడానికి మాటలు లేవు. పవన్ కళ్యాణ్‌ని అలా బిగ్‌స్క్రీన్‌పై చూస్తుంటే కలిగే ఆనందాన్ని వర్ణించలేం. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు, మీరంతా చూసేయండి” అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
https://x.com/IamSaiDharamTej/status/19709371604854376065
నాచురల్ స్టార్ నాని ‘ఓజీ’ని “ఒరిజినల్ జెయింట్ బ్లాక్‌బస్టర్” అంటూ ప్రశంసించారు. అలాగే దర్శకుడు బాబీ సైతం “ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను బిగ్‌స్క్రీన్‌పై చూశాను. పవర్ స్టార్ ఒక అద్భుతం” అని కొనియాడారు. సాయిదుర్గ తేజ్ థియేటర్‌లో రచ్చ రచ్చ చేశాడు. బిగ్ స్క్రీన్‌పై ఓజీ సినిమా చూస్తూ ఈలలు వేస్తూ గోలగోల చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. మరోవైపు అకీరా నందన్, ఆద్యా ఇద్దరు కలిసి ఓజీ సినిమాను వీక్షించారు. వీరిని చూసిన అభిమానులు వీడియోలు తీస్తూ సందడి చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.