CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రేపు ఉదయం 10 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఆ ముహూర్తాలో మార్పులు తెచ్చారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసిసి నేతలకు అలాగే ఇతర రాష్ట్రాల నాయకులకు ఆహ్వానం పంపారు. ముఖ్యంగా మల్లికార్జున కార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ నేతలకు ఆహ్వానం పంపినట్లుగా సమాచారం. వీరితో పాటుగా కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం కూడా పంపినట్లు తెలుస్తుంది.

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కి అలాగే, చతిస్గడ్ మాజీ సీఎం భూపేష్ కి, వీరితోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్, ఇదివరకు ఇన్చార్జిగా పని చేసినటువంటి దిగ్విజయ సింగ్, వీరప్ప మోహిలి, కుందియా, వాయిలార్ రవి ఇలాంటి ప్రముఖ వ్యక్తులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని కీలక సమాచారం వెల్లడైంది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణతో ఏర్పాటూలో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, కురియన్, సుశీల్ కుమార్ షిండే లాంటి నేతలు కూడా రానున్నారని సమాచారం.
