Congress Situation in AP : ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా ఉందని చెప్పవచ్చు. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రజలలో ఒక అపనమ్మకం కాంగ్రెస్ పార్టీ పట్ల ఏర్పడడం, ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీ, తెలంగాణ విభజనకు అప్పుడు కాంగ్రెస్ ప్రధాన కారణమని ప్రజలు నమ్మడమే దీనికి కారణం. ఈ పరిస్థితి వల్ల కాంగ్రెస్ మీద ప్రజల్లో అయిష్టత ఏర్పడింది.
2014 నుంచి రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక పోయింది. ప్రస్తుతం పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక స్థానం కూడా దక్కే అవకాశం లేదని చెప్పవచ్చు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని మెరుగుపరచాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఆశాజనకంగానే కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు గడువు దగ్గర పడుతున్న సమయన కాంగ్రెస్ తన ముద్రను తెలంగాణలో మళ్లీ చాటుకుంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో రావడంతో మంచి జోష్ లోనే ఆ పార్టీ ఉంది. ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకొని ప్రజలలో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం కోసం పార్టీ అధిష్టానం శ్రమిస్తుంది.
తెలంగాణలో ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఆంధ్రపై ఫోకస్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తుంది. పెద్ద ఎత్తున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ ఏపీ నాయకులు ఆలోచిస్తున్నారు. ఈ సభలకు ప్రియాంక గాంధీ, రాహుల్ రావాలని యోచనంలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇతర పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెంచే ఉద్దేశము, అలాగే 2024 ఎన్నికల్లో
కాంగ్రెస్ కు పదుల స్థానాల్లోనైనా సీట్లు దక్కించుకునే విధంగా ఆ పార్టీ అధిష్టానము ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఆ ప్రభావం ఏపీ పైన కచ్చితంగా పడుతుంది. ఇక్కడ పార్టీ బలోపేతం అవ్వడానికి అది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ఆంధ్రలో మళ్లీ బలమైన గుర్తింపును తెచ్చుకుంటుందా.. లేదా..? అనేది వేచి చూడాల్సిందే.
