యూరప్ దేశాల్లో రెండో విడత కరోనా విజృంభణ కొనసాగతుంది. దాదాపు అన్ని యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మొదలైన తర్వాత మొదటిసారి గా అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఏరోజుకి ఆరోజు సరికొత్త రికార్డు స్థాయి కేసులతో యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి.
జర్మనీలో మేజర్ మెట్రో సిటీలు కరోనాని కట్టడి చేయలేక చేతులెత్తేసాయి. సహాయం కోసం మిలటరీని రంగంలోకి దింపాలని మెట్రోసిటీలు కోరుతున్నాయి. జర్మనీలో అక్టోబర్ చివరి వరకూ కర్ఫ్యూ కోనసాగనుంది. బార్ లు అన్నీ మళ్లీ గవర్నమెంట్ చెప్పేవరకూ పర్మినెంట్ గా మూసేయాలి అని ఆదేశాలు జారీచేసింది.
దేశంలో అన్ని ఆసుపత్రిలో దాదాపు అన్నిచోట్లా సిబ్బంది కొరత ఉందని, వెంటిలేటర్లు కూడా సరిపోని పరిస్తితులు ఉన్నాయని గవర్నమెంట్ హెచ్చరికలు జారీచేసింది.
యూరప్‌లో కొవిడ్ కి దారుణంగా ఎఫెక్ట్ అయిన ఇంకో దేశం ఫ్రాన్స్.
ఫ్రాన్స్ లో కరోనా మొదలైన తర్వాత ఎప్పుడూ చూడనన్ని డైలీ కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే రెండు మూడు వారాలు పాటు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ గవర్నమెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది.
శుక్రవారం ఫ్రాన్స్ లో ఒక్కరోజే 20000 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ ఇదే డైలీ రికార్డు. ఫ్రాన్స్ ని భయపెట్టే ఇంకో అంశం పాజిటివ్ రేటు 10% పైనే ఉండటం. ఫ్రాన్స్ లో కొత్తగా 120 పైనే హాట్‌స్పాట్ లు గుర్తించింది గవర్నమెంట్. 1300 పైనే లోకేషన్లని డైలీ మోనిటర్ చేస్తుంది గవర్నమెంట్.
స్పెయిన్ లో కరోనా బీభత్సం రోజు రోజుకి పెరిపోతుంది. స్పెయిన్ రాజధాని మద్రిడ్ లో కేసులు పెరుగుదల దృష్టిలో పెట్టుకుని 15 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టారు. మద్రిడ్ వీధులుని పోలీసులు పర్యవేక్షణలోనే ఉన్నాయి. ప్రజలెవరిని రోడ్డు మీదకి కూడా రానియ్యకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది స్పెయిన్ గవర్నమెంట్.