ఒడిషా గవర్నర్ ప్రొఫెసర్ గణేషి లాల్ మరియు ఆయన భార్య సుశీల దేవి తో సహా ఇంకో నలుగురికి సోమవారంనాడు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. గవర్నర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేసారు. అయితే గవర్నర్ మరియూ ఫ్యామిలీని భువనేశ్వర్ లోని ఒక కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగా 78 సంవత్సరాల గణేషి లాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పైగా మిగతా ఫ్యామిలీ అందరికీ పాజిటివ్ వచ్చినా ఎవరికీ కరోనా లక్షణాలు అయితే కనిపించనట్టు వెల్లండించారు.
అయితే ఈమధ్య గవర్నర్ ప్రైవేటు సెక్రటరీ మరియూ ఒడిషా రాజ్యభవన్ లో ఇద్దరు డాక్టర్ లకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.
కాగా ఒడిషాలోని 147 మంది ఎమ్మెల్యేలలో మూడింట ఒక వంతు ఎమ్మెల్యేలకి మరియూ పదిమంది కేబినెట్ మంత్రులకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.
మాజీ మంత్రి BJD ఎమ్మెల్యే ప్రదీప్ మాహరథి కి గత నెల పాజిటివ్ వచ్చింది, తర్వాత ఆయన పాజిటివ్ నుంచి కోలుకున్నారు. అయితే ఆయన మరలా అస్వస్థతకు గురి అయ్యి చనిపోయారు.
ఒడిషాలో గత వారం రోజుల నుండి కోవిడ్ కేసుల పాజిటివ్ రేటు తగ్గుముఖం పడుతుంది. గత అయిదు రోజుల నుండి 4% కిందే పాజిటివ్ రేటు నమోదు అవుతుంది. ఇప్పటిదాకా ఒడిషాలో 2.93 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, 1400 మంది కరోనా తో చనిపోయారు.