కరోనా వైరస్ ఇండియా మొత్తం సామాజిక వ్యాప్తి జరగలేదా? అవును అనే అంటుంది కేంద్రం. గత ఆరునెలలుగా ఇండియాలో కరోన వైరస్ వ్యాప్తిని పరిశీలించిన కేంద్రం ఆ ప్రకటన చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆదివారం “సండే సామ్‌వాద్” కార్యక్రమంలో మాట్లాడుతూ కేవలం కొన్ని రాష్ట్రాలలో అది కూడా కొన్ని జిల్లాలలో మాత్రమే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందని, దేశం మొత్తం వ్యాప్తి జరగలేదని తెలిపారు.
దేశం లోని ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే వ్యాప్తి జరిగిందని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో సామాజిక వ్యాప్తి ని ఊహించామని, ఎందుకంటే అక్కడ ఉన్న జనసాంద్రత ని బట్టి సామాజిక వ్యాప్తి జరొగచ్చని ముందుగా ఊహించామని హర్షవర్ధన్ తెలిపారు.
డైలీ నమోదు అయ్యే కేసులలో 80% కేసులు కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే నమోదు అవుతున్నాయి అని, దేశం మొత్తం వైరస్ ఏమి విజృంభణ జరగలేదని తెలుపుతూ, శనివారం నమోదు అయిన కేసులు లెక్కలతో వివరించారు. శనవారం నమోదు అయిన 61,871 కేసులలో 79% కేసుకు 10 రాష్ట్రాల నుండే నమోదు అయినట్టు ఆయన తెలిపారు.కేవలం కర్నటక, మహారాష్ట్ర, కేరళా మాత్రమే 50 వేలు పైనే యాక్టివ్ కేసులు ఉన్నాయని, అలాగే ఇండియా మొత్తం మీద యాక్టివ్ కేసులు 8 లక్షల కిందకి చేరుకున్నాయి అని ఆయన తెలిపారు. ఏమైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలిని ఆయన విజ్ఞప్తి చేసారు.
కేంద్రమంత్రి చెప్పినట్టుగాని ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు స్పీడ్ 70% తగ్గినట్టు తెలుస్తుంది, డైలీ టెస్ట్ లు విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా రోజుకి 60-70 వేలు టెస్ట్ లు చేస్తున్నారు. కొవిడ్ స్పీడ్ గా ఉన్న టైంలో ఆంధ్రాలో డైలీ కేసులు10 వేలకు పైగా నమొదు అయ్యాయి. అలాగే సమ్మర్ లో ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కేసులు నమోదయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు టెస్టింగ్ పెంచినా కేసులు మాత్రం 4000 కిందకి వచ్చేసాయి. చూడాలి ముందు ముందు వైరస్ ఇంకెతకాలం ప్రభావం చూపుతుందో..