Covid 2023 : కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకునే క్రమంలోనే మళ్లీ విజృంభిస్తూ,ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రాబోయే పది-పన్నెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని కేంద్ర ,వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది వస్తుంది అని..మళ్ళీ తగ్గుముఖం పట్టె అవకాశాలు కూడా ఉన్నాయి అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటిపోయింది. రోజువారీగా ఏడు వేల కేసులు నమోదవుతున్నాయి ఈ సంఖ్య పదిహేను రోజుల్లో పతాక స్థాయికి చేరుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
2022 జనవరి లో ఒమిక్రాన్ వేరియెంట్ ఎలా అయితే వ్యాపించిందో, మళ్ళీ దాదాపు 15 నెలల తర్వాత యాక్టీవ్ కేసుల సంఖ్య 40 వేల స్థాయిని చేరింది. ఇది ఇలా ఉండగా గత ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ కారణంగా 16 మంది చనిపోయారు అని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
అయితే రాబోయే పది ,పన్నెండు రోజులాల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూన్నాయి. మాస్కులు లేకుండా జనసమూహాల్లోకి వెళ్లకూడదు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రజలు కోవిడ్ లేదు అనే అపోహలో మాస్కులు లేకుండా
ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకుంటే మాత్రం నాలుగో వేవ్ తప్పదు అంటున్నారు వైద్యులు. కరోనా తొలి వేవ్ 2020 మార్చి నెలలొ మొదలై ప్రజలను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఇక 2021 డిసెంబర్-2022 జనవరి సమయంలో మూడో వేవ్ భారీ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. తరువాత వచ్చిన ఒమిక్రాన్ తీవ్రత తగ్గినా.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా తో మరణించిన వారి సంఖ్య 5,31,016 అని కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.