Cranberry : బెర్రీ పండ్లు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ బెర్రి పండ్లలలో క్రాన్బెర్రీ కూడా అతి ముఖ్యమైనది. దీనివల్ల మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల పోషక విలువలు అంది మనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి ఈ బెర్రీ పండ్లు ఉపయోగపడతాయి. క్రాన్బెర్రీ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాటి వల్ల కలిగే ఉపయోగాలు మాత్రం అధికం. ఈ పండ్లు పులుపు, తీపి, ఆస్ట్రిజెంట్ వంటి రుచిని కలిగి ఉంటాయి.
ఈ చిన్ని పండ్లను తినడం వల్ల క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చు. అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరిగి, చెడు బ్యాక్టీరియా విసర్జింపబడుతుంది. క్రాన్‌బెర్రీస్ కిడ్నీలను డిటాక్స్ చేయడంలో మేలు చేస్థాయి. క్రాన్‌బెర్రీస్‌లో ప్రో-ఆంథోసైనిన్ ఉంటుంది. ఇది దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
ఈ పండ్ల లో ఉండే పాలీఫినాల్స్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండ్లు రొమ్ము, పెద్దప్రేగు, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలలో మనకు ఫైబర్ శాతం అధికంగా లభిస్తుంది. ఈ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన పొట్ట నిండుగా ఉండి ఆకలి ఎక్కువగా వేయదు. దానివల్ల బరువు సమస్యను మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఈ పండ్ల లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన శరీరంలో మంటను తగ్గిస్థాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ క్రాన్‌బెర్రీస్ పండ్లను ఆలస్యం చేయకుండా ఇవి దొరికే సమయంలో తీసుకొని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.