హీరోగా మాత్రమే కాదు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా బాహుబలిలో విలన్ రోల్ చేశాడు. ఇక సినిమా సినిమాకు తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నారు రానా. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రానా. విరాటపర్వంతో చివరిసారి ప్రేక్షకులను పలకరించాడు.
ఈ సినిమాలో ఆయన నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇక ఆయన పర్సనల్ విషయాలకొస్తే రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. వీరు 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రానా, మిహికాలు పెళ్లికి ముందే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రేక్షకులను అలరించేవారు. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేవారు. అయితే కొంతకాలం రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
ఇన్ స్ట్రాగ్రాంలోని తన ఫొటోలను డెలిట్ చేశారు. దీంతో రానా, మిహికాలు విడిపోతున్నారని కొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలకు రానా తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను తండ్రి కాబోతున్నట్లు మిహికాతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే విక్టరీ వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ అని అంటున్నారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఇంట్లో ఈ దీపావళికి డబుల్ ధమాకా సంబరాలు చేసుకున్నారని అంటున్నారు.
