భారత ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కలు ప్రకారం మంగళవారం భారత్ లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 55,342. గత ఐదు వారాలనుండి ఇండియాలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తిరోగమనంలో ఉంది. దాదాపు నెలరోజుల తరవాత యాక్టివ్ కేసులు సంఖ్య 9 లక్షల కిందకి రావడం ఇదే మొదటిసారి అంటూ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
జూలై చివరి వారంలో ఇండియాలో డైలీ కేసులు 55 వేలు దాటింది. ఆ తరవాత కేసులు పెరుగుతూ సెప్టెంబరు లో ఒకానొకదశలో లక్షకి చేరువయ్యాయి.
ప్రస్తుతం ఇండియాలో 8,38,729 కేసులు యాక్టివ్ గా ఉండగా, మొత్తం 62,27,295 మంది డిస్చార్జ్ అయ్యరు, అలాగే కరోనా తో పోరాటంలో 1,09,856 ప్రాణాలు కోల్పోయినట్టు భారత ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది, అలాగే ఇండియాలో రికవరీ రేటు 86.78 గా ఉండగా, మరణాల రేటు 1.5 గా ఉంది.