Delhi Liquor Scam: రేపు నా బిడ్డని అరెస్ట్ చేయొచ్చు…ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేసీయార్ సంచలన వ్యాఖ్యలు
ఈరోజు జరిగిన రాష్ట్రస్థాయి BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.BRS సమావేశంలో కేసీయార్ మాట్లాడుతూ “ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంభందించిన విషయంలో విచారణ పేరిట పిలిచి,రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందట. చేస్తే చేసుకోనివ్వండి అని” అన్నారు.
ఇలా ఎంతమందిని అక్రమ కేసుల పేరిట వేధించాలనుకున్నా, అక్రమ అరెస్టులు చేయాలనుకున్నా మీ ఇష్టం,ఏం చేస్తరో చేసుకోండి, భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.అప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ని,రవిచంద్రని ఇబ్బందులు పెట్టి వేధించారు. ఇప్పుడు ఏకంగా నా బిడ్డ వరకు వచ్చారు, అందరూ జాగ్రత్తగా ఉంటూ పనిచేయాలి, అని పార్టీ నేతలకి కేసీయార్ దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు రేపు ఈడీ విచారణకు హాజరు అవనున్న కవితకి, మనీలాండరింగ్ అంశం కింద ఈరోజు తాజాగా రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంభందించి మొత్తం వ్యవహారం అంతా హైదరాబాద్ కేంద్రంగానే నడిచింది అంటూ, సిసోడియా వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని తాజాగా ఈడీ నిర్దారణ చేసిన వేళ, రేపు కవిత వ్యవహారం లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది