Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ విచారణలో కవితని ED అడిగిన ప్రశ్నలు ఇవే…
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 16న ఎల్లుండి మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులిచ్చినట్లు సమాచారం..అయితే మొన్న జరిగిన విచారణ సందర్బంగా సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.ఇదిలా ఉంటే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. దీంతో.. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కార్యాలయం దగ్గర వాతావరణాన్ని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ఒకింత టెన్షన్ పడ్డారు.
ఇంతకీ కవిత తో ఏమేం ప్రశ్నించారో అని ఆరా తీయగా కొన్ని ప్రశ్నలు ప్రచారంలో ఉన్నాయ్.. అవి
1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?
2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది..!?
3. ఢిల్లీ గవర్నమెంట్‌కు సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?
4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?
5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?
6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?
7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?
8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?
9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?
10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?
11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?
12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?
13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?
14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?
15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?
16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?
17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?
18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?
19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..?
ఈ ప్రశ్నలతో పాటు వీటితో ముడిపడిన పలు అనుబంధ ప్రశ్నలను సంబంధిత వివరాలను కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మొత్తం అంతా దీనిపైనే..!ముఖ్యంగా..
మొన్న జరిగిన విచారణ మొత్తంలో కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారని సమాచారం. కవిత-పిళ్లై ఇద్దర్నీ కాన్‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారించారట. కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..