Delhi Liquor Scam:లిక్కర్ కేసులో కవితకి షాక్… స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి ఝలక్ ఇచ్చిన సుప్రీం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకి వచ్చిన ఈఢీ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ BRS పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధాఖలు చేసిన పిటిషన్ ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ తాజాగా తిరస్కరించింది.రేపటి విచారణ నుండి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం ని అభ్యర్థించగా, అందుకు సుప్రీం కవిత కోరికని నిరాకరించింది.అయితే యధావిధిగా కవిత రేపు ఈఢీ ముందు నోటీసులకి స్పందనగా విచారణకి హాజరు అవుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంభందించి ఇటీవలే ఢిల్లీ డిప్యూటీ సియం అరెస్ట్ అయిన నేపథ్యంలో,రేపు కవిత విచారణ సందర్బంగా కేసు ఏ మలుపు తిరుగుతుందో అని ఆత్రుత నెలకొంది. అన్ని వేళ్ళు కవిత వైపే చూపిస్తుండడం, హైదరాబాద్ వేదికగానే లిక్కర్ స్కామ్ కార్యక్రమాలు జరిగాయి అనే తాజా ఈఢీ ఆరోపణల నేపథ్యంలో, రేపు కవిత అరెస్ట్ తప్పదనే సంకేతం కనిపిస్తుంది. అయితే కవిత మాట్లాడుతూ తాను ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. చూడాలి మరి రేపటి విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో.