Delhi Liquor Scam :నేడు ఈఢీ ముందుకు కవిత… ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈఢీ ముందు విచారణకి BRS ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే ఈఢీ ముందు హాజరు కావడం కవితకి ఇది రెండోసారి. ఇటీవలే ఈ నెల 11న సుమారు 9 గంటలపాటు కవితని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ 16, అనగా ఈరోజు మరోసారి విచారణకి రావాలని పేర్కొన్న నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుంది అనేది కీలకంగా మారింది.
తాజాగా ఇవాళ ఉదయం 11 గంటలకి కవిత విచారణ కోసం ఈఢీ కార్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్ పాలసీ కి సంభందించిన రూపకల్పన, అందులో సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీ అప్ నేతలకి సంభందించి ముడుపులు తదితర అంశాలపై కవితని ప్రశ్నించడంతో పాటు బుచ్చిబాబు, అరుణ్ పిల్లైతో కలిపి విచారించాలని ఈఢీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇంతకుముందే ఈ కేసులో హైదరాబాద్ కి చెందిన ఆడిటర్ బుచ్చిబాబును ఈఢీ అధికారులు బుధవారం విచారించారు. ఒక్కడినే కాకుండా అరుణ్ పిళ్ళయ్ తో కలిపి విచారించినట్టు తెలిసింది. కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరిని విచారించాలని… సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హైదరాబాద్ హోటల్ లో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం