Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ట్విస్ట్ .. ఇవాళ విచారణకి హాజరు కాలేనన్న కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఇవాళ ఈఢీ విచారణకి కవిత హాజరు అయ్యే విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది..లిక్కర్ స్కామ్ కేసులో విచారణకి హాజరయ్యే అంశం కి సంభందించి ఇటీవల తను వేసిన పిటిషన్ సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉందని,ఆ పిటిషన్ కి సంభందించి జడ్జిమెంట్ 24 న వస్తుందని, ఆ తీర్పు కి అనుగుణంగానే విచారణకి సహకారం అందిస్తానని తాజాగా కవిత పేర్కొంది.అప్పటివరకు స్వయంగా విచారణకి రాలేనని కవిత తరపున లాయర్ భరత్ ఈఢీ కి తెలిపారు.
పైగా ఈ విషయం పై విచారణకి సంభందించి కవిత మాట్లాడుతూ మహిళను ఇంటి వద్దే విచారించాలని చట్టం ఇచ్చిన వెసులుబాటును గుర్తు చేసింది.అయినా ఇందుకు ఈఢీ ఒప్పుకోవట్లేదు అని ఆరోపించారు.అలాగే మొదటి విచారణలో భాగంగా సూర్యాస్తమయం తరువాత కూడా ఈఢీ కార్యాలయం లో ఉంచడం చట్ట విరుద్ధమే అని వ్యాఖ్యనించారు.ఏదేమైనా సుప్రీం మార్గదర్షాలు వెలువడేంతవరకు విచారణకి హాజరు కాలేనని స్పష్టం చేశారు.