Kalki 2: ‘కల్కి 2’ వచ్చేది ఎప్పుడు.. నాగ్ అశ్విన్ ఏం చెప్పారో తెలుసా?
Kalki 2: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో, అభిమానులు దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘కల్కి 2’ షూటింగ్, విడుదల తేదీలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో కీలక విషయాలను వెల్లడించారు.
‘కల్కి 2’ షూటింగ్‌పై నాగ్ అశ్విన్..
“కల్కి 2 షూటింగ్ చాలా పెద్ద సవాల్. ఇందులో నటీనటులందరి కాంబినేషన్ సన్నివేశాలు భారీగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలకు కూడా చాలా సమయం పడుతుంది. అందుకే అందరి డేట్స్ కుదిరినప్పుడే చిత్రీకరణ ప్రారంభించగలం. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. మరో రెండు సంవత్సరాల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను,” అని నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులంతా తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని ఆయన చెప్పారు.
తొలి భాగం కంటే భారీగా..
గతంలో నిర్మాత అశ్వనీదత్ ‘కల్కి 2’ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ప్రధానంగా ఉంటుందని, ఆయన, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాత్రలే ముఖ్యమని చెప్పారు. దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనలు ‘కల్కి 2’పై అంచనాలను మరింత పెంచాయి. ఈ సీక్వెల్ తొలి భాగం కంటే కూడా భారీ స్థాయిలో ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే..
ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రాజా సాబ్’ షూటింగ్ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ‘ఫౌజీ’ సెట్‌లోకి అడుగుపెడతారు. వీటితో పాటు సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా కూడా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక ప్రభాస్ ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొంటారు.