Disadvantages of Eating Sugar : మన శరీరానికి అత్యంత హాని కలిగించే ఆహార పదార్థాలలో పంచదార ఒకటి. మనం పంచదారను కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, ఐస్ క్రీములు, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి వివిధ రూపాల్లో ఆహారంలో తీసుకుంటాము. ఇలా పంచదారను అధికంగా తీసుకోవడం వల్ల మొటిమలు, జీర్ణక్రియ ఆలస్యం, రక్తంలో చక్కెర లెవల్స్ పెరగడం మరియు రక్తపోటుకు కారణమవుతుంది. అయితే మనం ఆహారం నుండి పంచదారను పూర్తిగా తొలగిస్తే అసలు ఏమి జరుగుతుంది? ఒక వారం మొత్తం పంచదార తీసుకోవడం మానేస్తే మీ శరీరం జరిగే కొన్ని మార్పులను ఇపుడు మనం తెలుసుకుందాం..
మనం ఆహారంలో పంచదారను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి అది కారణమవుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది ముఖ్యంగా హానికరం. ఆహారం నుండి చక్కెరను తగ్గించడం వలన రక్తంలో చక్కెర నియంత్రణను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఆహారంలో పంచదార ఎక్కువగా తీసుకోవడం కొందరికి అలవాటు. దానివల్ల ఉబ్బరం, గ్యాస్ మరియు డయేరియా వంటి జీర్ణ సమస్యలకు అది కారణం అవుతుంది. జీర్ణక్రియను సులభతరం మరియు వేగంగా అవడానికి, ఒక వారం పాటు చక్కెరను పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. దానివల్ల వచ్చే మార్పును మీరే చూసుకోండి.
షుగర్ అధికంగా వాడడం వల్ల కడుపులో మంట, శరీరానికి అలసట, కండరాల నొప్పికి అది కారణమవుతుంది. దీనివల్ల మనం తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇది ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ దోహదపడుతుంది. షుగర్ మానేయడం వల్ల షుగర్ మానేసిన ఒక వారంలోనే కడుపులో మంట తగ్గుతుంది.
Also Read: పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా..? అయితే ఇలా చేయండి..!!
ఆహారం నుండి షుగర్ తొలగించడం వల్ల కలిగే మరో ప్రయోజనం మంచి నిద్ర. మీకు కూల్ డ్రింక్, టీ లేదా కాఫీ వంటి పానీయాలు, ముఖ్యంగా నిద్రవేళలో షుగర్ కంటెంట్ ఉన్న ఆహారం తినే అలవాటు ఉంటే, మీకు నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షుగర్ మానేయడం వల్ల మనం సక్రమంగా నిద్రపోవడాన్ని అది మెరుగుపరుస్తుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా మీరు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, మీరు చేయవలసిన మొదటి పని మీ ఆహారం నుండి షుగర్ ని తగ్గించడం. బరువు పెరగడానికి ముఖ్యమైన కారణాల్లో షుగర్ తీసుకోవడం ఒకటి. కేవలం పంచదార మాత్రమే కాదు, మీరు కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, చాక్లెట్లు, కేకులు, కుకీలు, ఐస్ క్రీమ్‌లు లాంటి అన్ని షుగర్ కంటెట్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మానేయడం వల్ల ఒక వారం లో మీరు మీ శరీరం లో ఎన్నో మార్పులు గమనించవచ్చు.
