DK Sivakumar strategy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా బీ ఆర్ ఎస్ ఇప్పటికి కూడా దీమాగానే కనిపిస్తుంది.
రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం కూడా మరోవైపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముందుగానే అలర్ట్ అయ్యి కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత గా ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కాంగ్రెస్ రంగంలోకి దించింది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో అప్పుడు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో డీకే శివకుమార్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి సమస్యలు రాకుండా బాధ్యతలు తీసుకోవాలని శివకుమార్ ని రంగంలోకి దించారు.
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో కూడా డీకే శివకుమార్ తనదైన పాత్రను పోషించారు నాయకులందరిని ఒకేదాటి పైకి తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నుండి గెలవబోయే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి చేరే అవకాశం. అలాగే బి ఆర్ ఎస్ ,కాంగ్రెస్ మధ్య చాలా టైట్ ఫైట్ జరగబోతున్న నేపథ్యంలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే దానిపైన శివకుమార్ తో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు చేస్తూ ఉండడం ఇప్పటికే ఏఐసిసి ప్రతి నియోజకవర్గంలో నియమించడం కూడా జరిగింది.
నియోజకవర్గంలో అభ్యర్థి విజయం సాధించిన వెంటనే ఎమ్మెల్యే సర్టిఫికెట్ తో అతన్ని హైదరాబాద్ ని తాజ్ కృష్ణ హోటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ డీకే శివకుమార్ సమక్షంలోనే గెలిచిన అభ్యర్థులు ఉండబోతున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజార్టీ వచ్చిన కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని శివకుమార్ భావిస్తున్నారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా డీకే శివకుమార్ చక్ర దిప్పబోతున్నారు.
