సాధారణంగా జంటలు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ఆలోచనల్లోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు.
కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటించండి..ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలి. కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం, సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది.
దాని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం, అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడంతో పాటు ఒకరి ఇష్టాలను మరొకరు కాదనకపోవడం, కలసి సరదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తే దంపతుల మధ్య తప్పకుండా ప్రేమ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.