నేటికాలంలో పురుషులు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌కు గురవుతారు. దీనివల్ల సరైన నిద్ర ఉండదు. ఆకలి తగ్గుతుంది. డిప్రెషన్ కారణంగా ఏ పని చేయాలని అనిపించదు. ఈ పరిస్థితిలో ఒత్తిడిని అధిగమించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో చూద్దాం..
నో చెప్పడం:
చాలాసార్లు డిప్రెషన్‌కు కారణం మానసిక సమస్యలు. వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌కి గురవుతారు. అందుకే ఒత్తిడిని నివారించడానికి నో చెప్పడం నేర్చుకోవాలి. అన్ని పనులని ఒక్కరే చేయకూడదు. దీనివల్ల మీకు తెలియకుండా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు.
కుటుంబ సభ్యులతో గడపడం:
చాలాసార్లు పని కారణంగా పురుషులు స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. వారికి సమయం కేటాయించలేరు. దీని కారణంగా పురుషులలో డిప్రెషన్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. మరోవైపు ఒంటరిగా ఉన్నట్లయితే స్నేహితులతో సమయం గడపాలి.
మీపై దృష్టి పెట్టండి:
డిప్రెషన్ లక్షణాలను నివారించడానికి పురుషులు తమపై దృష్టి సారించాలి. మీకోసం మీరు కొంత సమయం తీసుకోవాలి. ప్రతిరోజు సరైన నిద్రని ఆస్వాదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని జీవితంలో భాగంగా చేసుకోవాలి.