పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పడింది.ఇక బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011 లో స్నేహలత రెడ్డితో వివాహం అయింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్నేహ పెళ్ళికి ముందు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసింది.ఇండియా వచ్చాక తన తండ్రి స్థాపించిన కాలేజ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంది
స్నేహ పెళ్ళయాక కూడా ఒక వైపు పిల్లలు అయాన్, అర్హలను చూసుకుంటూ మరో వైపు కాలేజ్ బాధ్యతలు, స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా పని చేస్తుంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి తన టేస్ట్ కి తగ్గట్టుగా బేబీ ఫొటోగ్రఫీ, మెటర్నటీ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా రన్ చేస్తుంది. స్నేహ ఎంత పెద్ద చదువు చదివినా నిరాడంబరంగా ఉండటం ఆమె ప్రత్యేకత. అమెరికాలో చదివిన పక్కా హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతూ.. భర్తను అత్తమామలను గౌరవిస్తూ.. అచ్చ తెలుగు కోడలు పిల్లలా అందరిని మెప్పిస్తుంది స్నేహ.