చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.
ఓసేయ్ రాములమ్మా తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న రికార్డున్నీ బద్దలు కొట్టింది. సినిమాలకు గుడ్ బై చెప్పాక రాములమ్మ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే విజయశాంతి ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడు బయట పెట్టలేదు.
కానీ ఈ మధ్య కొన్ని విషయాలు తెలిశాయి. విజయ శాంతి భర్త పేరు శ్రీనివాసరావు ప్రసాద్. విజయశాంతి తండ్రి పేరు కూడా అదే కావడం విశేషం. అయితే తనతో పాటు తన భర్తకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమట. ఉద్యమం, పార్టీలాంటివి మొదలు పెట్టిన తర్వాత పిల్లల్ని కనాలనిపించలేదని చెప్పుకొచ్చింది.
అప్పట్నుంచి తనకు ప్రజలే పిల్లలని చెప్పుకొచ్చింది విజయశాంతి. ఒకవేళ పిల్లలు పుడితే.. తాను వాళ్ల కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.. స్వార్థం కూడా పెరిగిపోతుందని పిల్లల్ని వద్దనుకున్నామని సంచలన విషయాలు బయట పెట్టింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.