సౌత్ ఇండియన్స్ ఎక్కువగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా.. మరునాడు ఉదయాన్నే తింటుంటారు. అయితే కొన్నిసార్లు నేరుగా అన్నాన్ని తినకుండా.. పోపు వేసుకోవడం.. లేదా ఆ అన్నంతో వడియాలు పెట్టడం చేస్తుంటారు. ఇక కొంతమంది పేదవాళ్లు తమ ఇంట్లో రెండు పూటలకు అవసరమైన ఆహారాన్ని ఒకేసారి చేసుకుని రాత్రి మిగిలిన అదే అన్నాన్ని ఉదయం టిఫిన్ కి బదులుగా తింటూ ఉంటారు. ఇలా ఎక్కువగా పేద కుటుంబాలలో జరుగుతుంది అయితే ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం తినడం వల్ల జరిగే కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే..
మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అయితే బియ్యం కడిగిన తర్వాత గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువసేపు ఉంచినప్పుడు అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీన్ని తిన్న తర్వాత ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అందుకే అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు. అలాగే అన్నం చాలాసేపు నిల్వ ఉంటే తినకూడదు.
అయితే మిగిలిపోయిన అన్నాన్ని సరైన పద్ధతిలో ఎలా తినాలి అంటే అన్నం వండిన తర్వాత ఒకటి లేదా రెండు గంటల్లోపు ఆ అన్నాన్ని తినేయాలి. అలా కుదరకపోతే ఆ అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇక ఫ్రిడ్జ్ లో ఉంచిన అన్నాన్ని కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత మాత్రం తినకూడదు. ఫ్రిజ్లో కూడా అన్నం కొన్ని గంటలు మాత్రమే తాజాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వేడి చేసిన అన్నం తినడం కూడా అంత మంచిది కాదు. అలా వేడి అన్నం తినాలి అనుకున్న వాళ్లు అన్నం తయారు చేసిన వెంటనే తినేయడం మంచిది. అలా కాకుండా దాన్ని నిల్వ ఉంచి మళ్ళీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.