ఒకప్పుడు ఏ శుభకార్యానికి వెళ్లినా కచ్చితంగా అరటి ఆకులోనే భోజనం పెట్టేవారు. క్రమేపీ ప్లాస్టిక్ వాడకం పెరగడంతో ఆర్టిఫిషియల్ అరటి ఆకుల్లో భోజనం పెడుతున్నారు. ఫంక్షన్ సమయంలో సమయం ముఖ్యం. దీంతో అరటి ఆకు ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండదని అందరూ ప్లాస్టిక్ ఆకులపై మక్కువ చూపించారు. అయితే మీకు ఎప్పుడైనా మనం అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేస్తున్నాం?
ఏ టేకు ఆకో లేదా ఇతర ఆకుల్లో ఎందుకు భోజనం చేయడం లేదనే విషయం ఎప్పుడైనా గమనించారా? అస్సలు అరటి ఆకు ఎందుకు వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా పెళ్లిళ్ల సమయంలో ఇంటి గుమ్మానికి అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు. చాలా మంది పచ్చదనం శుభప్రదం అందుకే ఇలా పూర్వీకులు ఇలా అలంకరించేవారు అనుకునే వారు. కానీ అందులో కూడా ఓ సైన్స్ దాగుంది.

Also Read : కాళ్లకు పట్టీలు ధరించడం వెనుక ఇంత సైన్స్ ఉందని మీకు తెలుసా?
అరటి చెట్టు గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధకంగా ఉంటాయి. వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరవు. అందువల్లే అరటి ఆకులో భోజనం చేయడమే మేలని పెద్దలు చెబుతారు.
Banana leaves have an anti-bacterial property; this prevents germs & bacteria from spreading in your food. Let’s know the health benefits of eating on banana leaf in this article.
