ఆఫ్రికాకి కరోనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు, పుండు మీద కారంలా తయారయింది ఆఫ్రికా పరిస్థితి.
ఆఫ్రికా ఆర్థికంగా మరియూ ఆరోగ్యపరంగా కరోనా వైరస్ చేసిన నష్టం నుండి కోలుకోవాలంటే రాబోయే మూడు సంవత్సరాల లో $1.2 ట్రిలియన్ డాలర్లు అవసరం అవుతుంది అంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) ప్రకటించింది.
IMF అధ్యక్షుడు క్రిస్టాలినా జార్జివా, ప్రపంచ దేశాలు ఈ సమయంలో తలో చేయి వేసి సహకరించాలి అంటూ ఒక ప్రకటనలో తెలిపారు.
నిజానికి ఆఫ్రికాలో, మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కేసులు కానీ మరణాలు కానీ చాలా తక్కువగానే ఉంది. కానీ ప్రపంచ బ్యాంక్ చెప్తున్న దాన్నిబట్టి 43 మిలియన్ ఆఫ్రికన్లు దారిద్ర్య రేఖ దిగువకి వచ్చే ప్రమాదం ఉంది.
కరోనా వైరస్ వల్ల ఆర్థిక తిరోగమనం మొదలయ్యి, ఆ ప్రభావంతో ఉద్యోగాలు పోవడం, కుటుంబం ఆర్థిక రాబడిలో 12% తగ్గుదల నమోదు అయ్యింది అని జార్జీవా తెలిపారు.
కాగా, ఇప్పటివరకూ ఆఫ్రికాలో 1.5 మిలియన్ కరోనా కేసులు, 37000 కరోనా మరణాలు నమోదు అయ్యాయి.