Dog Seemantham: మామూలుగా మానవులు పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్కలు ఎప్పుడూ అగ్ర స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. అంతేగాకుండా కుక్కలకి ఉన్న విశ్వాసం మనుషులకి కూడా ఉండదని అలాగే కుక్కలు మనుషులకి తోడుగా ఉంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలో కుక్కల కోసం పలు ఎన్జీవోలు ఇప్పటికే ప్రత్యేకంగా పెట్ క్రాస్ సంస్థలను కూడా రన్ చేస్తున్నాయి. అలాగే వీధి కుక్కలకి ఆహారం అందించడం, గాయాలు తగిలినప్పుడు చికిత్సలు చేయించడం వంటివి కూడా చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా తాము ఎక్కడికి వెళితే అక్కడికి తమ కుక్కలను కూడా తీసుకువెళుతుంటారు.
పెంపుడు కుక్కకి సీమంతం (Dog Seemantham):
అయితే తాజాగా సోషల్ మీడియాలో పెంపుడు కుక్కకి సీమంతం అనే వీడియొ తెగ వైరల్ అవుతోంది. అయితే కర్ణాటక కి చెందిన ఓ కుటుంబం గత కొన్నేళ్లుగా పెంపుడు కుక్కని పెంచుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆ కుక్క గర్భం దాల్చింది. దీంతో మహిళలు గర్భం దాల్చిన సమయంలో నిర్వహించే సీమంతం ని తమ పెంపుడు కుక్కకి కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఘనంగా తమ బంధువులని పిలిచి సీమంతం నిర్వహిస్తూ రావోయి చందమామ అంటూ పాటలు పాడుతూ అట్టహాసంగా నిర్వహించి విందు భోజనం కూడా పెట్టినట్లు సమాచారం.

దీంతో కుక్కకి సీమంతం నిర్వహిస్తున్న సమయంలో కొందరు బంధువులు సెల్ ఫోన్ లో వీడియొలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియొ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అలాగే ఒక్కొక్కరూ తమకి నచ్చిన విధంగా జంతువులపై ప్రేమ చూపిస్తుంటారని కానీ ఈ కుటుంబం మాత్రం వేరే లెవెల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
కుక్కకి పుట్టిన రోజు వేడుకలు:
ఈ విషయం ఇలా ఉండగా ఇలా కుక్కలకి వేడుకలు నిర్వహించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలామంది పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం, కేక్ కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ప్రేమని చాటుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక పాశ్చాత్య దేశాలలో కుక్కల్ని పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.