Dogs attack: అంబర్ పేట్ లో కుక్కల దాడి ఘటన మరువకముందే మరో దాడి…ఎక్కడంటే..???
తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు భయపెడుతున్నాయి. వరుస దాడులతో ప్రజలని హడలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం లోని ఎస్సీ హాస్టల్ లోకి కుక్కలు జొరబడి సుమంత్ అనే అబ్బాయిని కరిచాయి. దీనితో బాలుడిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
అలాగే హైదరాబాద్ లో ఈ ఉదయం చైతన్యపురిలో కూడా మరో బాలుడిపై కుక్కలు దాడి చేశాయ్. ఇలా వరుస ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం.. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కుక్కల బారి నుండి కాపాడాలని, వాటి బెడద లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.