Donald Trump Arrested :అగ్రరాజ్యంలో అలజడి..పోర్న్ స్టార్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని సంఘటన చోటు చేసుకుంది.ఇటీవలే వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.పోర్న్ స్టార్ కేసులో ఆయన తాజాగా అరెస్ట్ అయ్యారు.అమెరికా పోర్న్ స్టార్ అయిన స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల అంశానికి చెందినటువంటి కేసులో తాజాగా ట్రంప్ కోర్ట్ ఎదుట లొంగిపోవడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.ఈ ఘటనతో అగ్రరాజ్యం లో ఒక్కసారిగా అలజడి రేగినట్టయింది.
అయితే ట్రంప్ ని అరెస్ట్ చేసిన తరువాత ఆయన తరపున లాయర్లు మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ట్రంప్ కి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయ్ అని వివరించారు.ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానన్న ట్రంప్ కి ఈ అరెస్ట్ అంశం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే అగ్ర రాజ్యం అయినటువంటి అమెరికా చరిత్రలోనే ఇలా ఒక నేర అభియోగపరమైన అంశంతో అరెస్ట్ అయిన మొట్టమొదటి మాజీ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఆపఖ్యాతి మూటకట్టుకోవడం విశేషం.