Kaantha: లక్కీభాస్కర్‌తో పాటు కాంత షూటింగ్.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kaantha: మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా, అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘కాంత’ విడుదల తేదీ ఖరారైంది. భారీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్స్ జోరు పెంచిన దుల్కర్, సహ నిర్మాత, కీలక పాత్రధారి అయిన రానా దగ్గుబాటితో కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు.
దుల్కర్ సల్మాన్, ఇటీవల మరో సినిమా ‘లక్కీ భాస్కర్’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల లుక్స్‌పై దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముందుగా ‘కాంత’ను, ‘లక్కీ భాస్కర్’తో పాటే షూట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు రెండు టీమ్‌లు అక్కడే ఉండేవారు. రెండు లుక్స్‌లో ఉన్న కామన్ థింగ్‌ను పోల్చి చూసే ప్రయత్నం చేశారు,” అని దుల్కర్ తెలిపారు.
‘కాంత’ చిత్రం 1980ల నాటి పీరియాడిక్ లుక్‌లో సాగుతుంది కాబట్టి, ఆ గెటప్‌లోకి పూర్తిగా మారిపోవాల్సి వచ్చింది. అయితే, ఈ సినిమాలో క్లీన్ షేవ్ లుక్ అవసరం కావడంతో, రెండు లుక్స్‌ను ఒకేసారి మేనేజ్ చేయడం సాధ్యం కాలేదని ఆయన వివరించారు. ‘కాంత’ నిర్మాణ పనుల్లో ఆలస్యం కావడమూ దీనికి ఒక కారణమని దుల్కర్ స్పష్టం చేశారు.
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. భారతీయ నటుడు, సినీ గాయకుడుగా ప్రసిద్ధి చెందిన ఎంకే త్యాగరాజ భగవతార్ ప్రయాణం స్ఫూర్తిగా రూపొందిన ఒక ఫిక్షనల్ క్రైమ్ డ్రామా అని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. అంతేకాదు, ‘కాంత’ సాధారణ పీరియాడిక్ డ్రామా కాదని, ప్రేక్షకులకు ఒక మోడర్న్ సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని దుల్కర్, రానా దగ్గుబాటి ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘అమ్మాడివే’ పాటతో పాటు ‘రేజ్ ఆఫ్ కాంత’ ట్రాక్ ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ భారీ ప్రాజెక్టుకు దుల్కర్ సల్మాన్‌తో పాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
