Earthquake Of 4.4 Magnitude Shakes Delhi&chennai :నిమిషాల వ్యవధిలో భారత్ లో రెండు చోట్ల భూ కంపాలు..
నిమిషాల వ్యవధిలో భారత్ లో రెండు చోట్ల వరుస భూ కంపాలు సంభవించాయి. కాసేపటి క్రితమే ఢిల్లీలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలు పై 3.6 గా నమోదు అయినట్టు..ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ప్రకటించి కాసేపు అయిందో లేదో తాజాగా చెన్నై లోను భూమి కంపించింది.దీనితో ప్రజలు ఇళ్ళు, ఆఫీసుల నుండి భయంతో భయటికి పరుగులు తీశారు.అయితే చెన్నైలో సంభవించిన భూ కంపం నిజం కాదని.. అది అండర్ గ్రౌండ్ మెట్రో పనుల వల్లే అలా అని స్థానికులు చెబుతున్నప్పటికి..మా పనుల వల్ల కాదని మెట్రో సంస్థ కొట్టిపారేసింది.
కాగా ఇటీవలే భూమి పొరల్లో కదలికల వల్ల హిమాలయాలపై ఒత్తిడి పెరిగి త్వరలో భారత్ లో కూడా భారీ భూ కంపాలు సంభవించే ప్రమాదం ఉందని NGRI చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణ చందర్ రావు నిన్న ప్రకటించడం కొసమెరుపు..
అయితే ఇదే “భూకంపం”.. ఇటీవలే టర్కీ సిరియాపై తన ప్రతాపాన్ని ఎంత భయానకంగా చూపిందో మనందరికీ తెలిసిందే.దాదాపుగా ఇప్పటికే 46,000 మంది మృత్యువాత పడ్డారు.. ఎన్నో వేలల్లో క్షత గాత్రులు, లక్షల్లో నిరాశ్రయులుగా మిగిలారు. ఎటు చూసినా మృత్యు ఘోష.. కేకలతో భయానక వాతావరణం ఏర్పడింది అక్కడ. తల్లిదండ్రలని కోల్పోయిన పిల్లలు, పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇలా హృదయాన్ని పిండేసే ఘటనలు కనబడటం ప్రపంచ దేశాలని సైతం కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇప్పటికే ఆస్తి, ప్రాణ నష్టం తో విలవిల్లాడుతూ ఉన్న టర్కీ సిరియా ప్రజలని భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కూడా సహాయ కార్యక్రమాలు అందించడం జరిగింది.