EC Break to Rythu Bandhu : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ బిఆర్ఎస్ కొత్త ఎత్తుగడలను వేస్తూ ప్రచారంలో ముందుకు వెళుతుంది. కానీ బి ఆర్ ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయని చెప్పొచ్చు. రైతుబంధు పంపిని విషయంలో ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు “ఫలానా సమయానికి, పలానా తేదీన రైతుబంధు డబ్బులు పడతాయి,” అని వ్యాఖ్యానించి నిబంధనలు ఉల్లంఘించారనే నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బీ ఆర్ ఎస్ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘించారని అందుకే అనుమతిని ఉపసంహరించుకున్నట్టు ఈసీ పేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకు నోటీసులను సైతం జారీ చేసింది.
రైతుబంధు పేరిట ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేలు అందిస్తుంది. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ తెలంగాణ రైతులకు వర్తింపజేసేది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబి సీజన్ కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేయలేక పోయింది. అయితే ప్రభుత్వం రైతు నిధుల విడుదలకు ఈసీ అనుమతిని కోరింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కూడా ఇచ్చింది.
ఈసీ అనుమతి యొక్క ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్రఖండనను తీసుకువచ్చాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సోమవారం రోజు ప్రకటించింది.
