England Vs New Zealand 2nd Test:సంచలన విజయం సాధించిన న్యూజిలాండ్… ఒకే ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్ ఫై గెలుపు
ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ సంచలన రీతిలో ముగిసింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో చివరికి న్యూజిలాండ్ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచి సంచలన విజయం నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 435-8 వద్ద డిక్లేర్ చేయగా, ఆ తరువాత న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ 483 రన్స్ కి ఆల్ అవుట్ అయి, ఇంగ్లాండ్ ముందు 257 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.దీంతో 257 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ చివరికి 256 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.ఇంగ్లాండ్ లో జో రూట్ (95) మినహా అందరూ విఫలం అయ్యారు