యూరప్ దేశాలు కరోనా రెండో వేవ్ తో చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇండియాలో వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు యూరప్ లో కంట్రోల్ అవుతున్నట్టు అనిపించింది. అయితే శీతాకాలం ఎంటర్ అయ్యేసరికి వైరస్ తన ప్రభావం చూపించడం మొదలెట్టింది.
ఏరోజుకారోజు సింగల్ డే రికార్డులతో దాదాపు అన్ని యూరప్ దేశాలు వైరస్ బారిన పడుతున్నాయి.
ఉదాహరణకి ఫ్రాన్స్ పరిస్థితి ఒకసారి గమనిస్తే, ఫ్రాన్స్ జనాభా కేవలం 6.5 కోట్లు అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా తో సమానం, కానీ ఫ్రాన్స్ లో నమోదు అయిన కేసులు శుక్రవారం 42,032, శనివారం 45,422, ఆదివారం 52,010. అంటే కరోనా పీక్ టైంలో ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయిన కేసులకి 5 రెట్లు ఎక్కువ. కనీ వినీ ఎరుగని స్థాయిలో లో ఫ్రాన్స్ అతలాకుతలం అవుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వైరస్ పెరుగుతున్నా ఫ్రాన్స్ ఏమి చేయడం లేదని కాదు. దాదాపు అన్ని చోట్లా కర్ఫ్యూ అమలులోనే ఉంది.
ఇంక మొదటి వేవ్ లో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా ఇబ్బంది పడిన ఇటలీ విషయానికి వస్తే , ఇటలీలో కరోనా కేసులు శుక్రవారం 19 వేలు పైనే, శని ఆది వారాలు కూడా శుక్రవారం రికార్డులు బద్దలు అయ్యాయి, మరోసారి సింగిల్ డే రికార్డు నమోదు అయింది. ఒక్క ఆదివారం ఇటలీలో 21,273 కేసులు నమోదయ్యాయి.
డచ్ కూడా మొదటిసారి 10 వేల కేసులు దాటింది, డచ్ లో కఠినమైన నిబంధనలు విధించారు.
పోలాండ్ లో గత వారం రోజుల్లో నాలుగు రోజులు డైలీ కేసులు రికార్డులు చెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పోలాండ్ కర్ఫ్యూ లో ఉంది.
జర్ననీలో కూడా డైలీ కేసులు మొదటిసారి 10 వేలు పైనే నమోదు అవుతున్నాయి. కఠినమైన లాక్ డౌన్ విధించారు. వేరే ప్రాంతాలకి ప్రయాణాలు పైన నిషేధం విధించింది గవర్నమెంట్.