Exit Poll : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జోర్దార్ గా సాగుతున్నాయి. అయితే ఈసి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకోవడం పై పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు.
ఈరోజు సాయంత్రం 5.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5:30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఇక తెలంగాణలో సాయంత్రం 5:00 వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు.. ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణమే నెలకొంది.

ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఈవీఎంలు పనిచేయనిచోట వెంటనే కొత్త వాటిని మేము అందించాము. ఇంకా అర్బన్ ఏరియాల్లో పోలింగ్ శాతం పెరగాలి. అక్కడ అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాము. అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు అవుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ వెంటనే స్పందించి అల్లరి మూకలను జమ కాకుండా గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది. కవిత వ్యాఖ్యల పై DEOకు ఆదేశాలు జారీ చేశాము. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రూరల్‌లో పోలింగ్ శాతం బాగానే ఉంది. అని ఆయన వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు అని ఆయన అన్నారు.
