Exit Poll Result : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది .ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కీలక సమాచారం ప్రకారం ఈ పార్టీనే విజయానికి దగ్గర ఉంది అని ఒక వార్త బయటకు వచ్చింది. ఆ పార్టీ మరేదో కాదు కాంగ్రెస్ పార్టీ. ఈసారి ప్రజలందరూ మార్పు కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీని గెలిపించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటివరకు కొన్ని న్యూస్ చానల్స్ సర్వేలు నిర్వహించాయి. వాటిల్లో ఈ విషయం వేల్లడైంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్వస్థి పలకాలి ఉన్నారని వార్త బాగా ప్రచారమైంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎన్నుకుంటారని ప్రచారం బాగా జరిగింది. దానికి నిదర్శనంగానే ఈరోజు ఓటింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్న విషయం కూడా దానికి బలాన్ని చేకూరుస్తుంది. కచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రానుందని అందరూ భావిస్తున్నారు.
వెళ్లడైన సర్వేల ఆధారంగా బీఆర్ఎస్ కు కేవలం 48 స్థానాలు రాగా, అత్యధిక మోతాదులో కాంగ్రెస్ కు 56 స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది. ఇక బీజేపీ విషయానికొస్తే కేవలం పది స్థానాలతో సర్దుకొనుందని, అలాగే ఎంఐఎం కేవలం ఐదు స్థానాలు దక్కించుకోనిందని తాజా సర్వేలో వెళ్లడైంది.