• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Eye Twitch : పురాణాల్లో కను శాస్త్రం… కన్ను అదిరితే జరిగేది ఇదే.. సైంటిఫిక్ రీసన్ ఏంటి ఇలా ఉంది.

Rama by Rama
October 18, 2023
in Latest News, Life Style
248 5
0
Eye Twitch : పురాణాల్లో కను శాస్త్రం… కన్ను అదిరితే జరిగేది ఇదే.. సైంటిఫిక్ రీసన్ ఏంటి ఇలా ఉంది.
492
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Eye Twitch : మన భారతదేశం ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలకు పేరు గాంచిన దేశం అని మీకు తెలిసిందే. మన పూర్వీకుల కాలం నుండి చాలా శకునాలని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయ ప్రకారం శకునాలని బలంగా నమ్ముతారు. ఏదైనా పని మొదలుపెట్టాలి అని అనుకున్నా కూడా శకునాన్ని, ముహూర్తాన్ని చూసుకొని మొదలు పెడతారు.  చాలామంది శకునాల పట్ల అంతా ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారు.  అయితే వీటిల్లో కొన్ని మనం ఇప్పటికి వింటూనే ఉన్నాం.

దాంట్లో ముఖ్యంగా కన్ను అదరడం. దీని గురించి మన అమ్మమ్మలు, తాతయ్యలు మన అమ్మలు కూడా మాట్లాడుతూ ఉంటారు. దీంట్లో ఆడవారికి కళ్ళు అదిరితే ఒక రకమైన శకునంగా.. అలాగే మగవారికి కన్ను అదిరితే మరో రకమైన శకునంగా పరిగణిస్తారు. ఆడవారికి కుడి కన్ను అదిరితే అదేదో చెడు శకునంగా భావిస్తారు. ఎడమ కన్ను శుభ శకునంగా అనుకుంటారు. అలాగే మగవారికి ఎడమ కన్ను అదిరితే చెడు శకునంగా, కుడి కన్ను అదిరితే శుభశకునంగా మన వాళ్లు అంచనా వేస్తూ ఉంటారు. 

అయితే ఈ కన్ను అదరడం గురించి పురాణాల్లో కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా దీని ప్రస్తావన రామాయణ కాలంలోనే జరిగిందని చెబుతూ ఉంటారు. అవును.. మీరు వినేది నిజమే..  మనం ఇప్పుడు ఆచరిస్తున్న ఆచార సంప్రదాయాలు అన్నీ కూడా మన పురాణాల నుంచి మనం తీసుకున్నవే.. ఇప్పటికి కూడా వాటిని పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రామాయణంలో కన్ను అదరడం గురించి ప్రస్తావించారు. సీతాదేవిని, రావణాసురుడు అపహరించే సమయంలో సీతాదేవికి కుడి కన్ను అలాగే లక్ష్మణుడికి ఎడమ కన్ను అదిరిందని రామాయణంలో పేర్కొన్నారు. 

అలాగే.. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే రావణుడికి కుడి కన్ను. సీతకు ఎడమ కన్ను అదిరాయనీ కూడా రామాయణంలో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే..రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు కూడా రావణుడికి, మండోదరి కూడా కన్ను అదిరింది అంట.. 

చూసారు కదా .. రామాయణ కాలం నుంచే కన్ను అదరడం గురించి దాని యొక్క ప్రభావాన్ని, శకునాల రూపంలో ప్రస్తావించారు. ఇప్పటివరకు మనం పురాణాల్లో కన్ను అదరడం గురించి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం.  అయితే దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఏమైనా ఉందా..?  వైద్యశాస్త్రం ప్రకారం కన్ను అదరడానికి శరీరంలో ఏమైనా మార్పులు జరగడానికి సంబంధం ఉందా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కన్ను అదరడాన్ని మూడు రకాలుగా చెప్తూ ఉంటారు.. 

ముఖ్యంగా కంటి రెప్పల్లోనే కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు కన్ను అదురుతూ ఉంటుంది అంటారు..అయితే ఆ మూడు రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..కన్ను అదరడంలో ఒక రకాన్ని  “మయోకిమియా” అని అంటారు. ఇది సాధారణంగా అందరిలో జరుగుతూనే ఉంటుంది. ఇది మన మారుతున్న జీవన శైలి మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కండరాలు ఆకస్మికంగా సంకోషించడం వల్ల కన్ను అదురుతుంది. 

ఇది ఎక్కువగా చాలామందికి కంటి పైరెప్పల్లోనే తెలుస్తుంది. కొద్దిమందికి ఇది కంటి కింది రెప్పల్లో కూడా తెలుస్తుంది. అయితే…ఇది కొద్ది కాలమే ఉన్నప్పటికీ దాని స్పర్శ అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సమస్య రావడానికి గల  కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన రోజువారి తినే ఆహారంలో మార్పులు రావడం వల్ల ఇది జరుగుతుంది. రోజువారీ జీవనశైలిలో కొన్ని మనం మార్చుకున్నట్లు అయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇక రెండో కారణంగా హెమిఫేషియల్ స్పస్మ్ ను చెప్పుకోవచ్చు..ఈ హేమీఫేషియల్ అనేది జన్యు సంబధిత సమస్యల  వల్ల ఏర్పడుతుంది. ఇది శరీరంలో జరిగే అంతర్గత సమస్యలను సూచిస్తూ ఉంటుంది.

ఇక మూడో కారణం బ్లేఫరోస్పస్మ్.. మనకు పదే,పదే కన్ను అదిరినట్లయితే వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. ఎక్కువగా బ్లేఫరోస్పస్మ్ ప్రభావం ఒక్కోసారి  కొన్ని సెకండ్లు, లేకపోతే నిమిషాలు, కొన్నిసార్లు కొన్ని గంటలసేపు కూడా ఉండవచ్చు. కనీసం కళ్ళు మూసుకో లేనంత ప్రభావం కూడా ఒక్కోసారి ఉంటుంది. 

కాబట్టి ఇలాంటి లక్షణాలు మీకు ఎప్పుడైనా కనిపించినట్టయితే మీరు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ నీ సంప్రదిస్తే మంచిది..ఫ్రెండ్స్ ఈ మూడు కారణాలే కాకుండా కన్ను అదరడానికి మరికొన్ని కారణాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.  ముఖ్యంగా కన్ను అదరడం అనేది..

మెదడు లేదా నరాల లోపాల వల్ల  జరుగురుతూ ఉంటుంది. కానీ ఇది అరుదైన లక్షణం..అలాగే ఎక్కువ శాతం ఒత్తిడికి గురైనప్పుడు కూడా కన్ను అదురుతుంది. మనలో చాలామంది ఎప్పుడూ టీవీ లేదా మొబైల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా ఎక్కువసేపు వాటి ముందే కూర్చున్నప్పుడు వాటి ప్రభావం వల్ల కన్ను అదురుతుంది. కన్ను అదరడానికి మరో కారణంగా నిద్రను కూడా చెప్పుకోవచ్చు. నిద్ర లేమీవల్ల కన్ను ఆదురుతుంది. సంపూర్ణమైన నిద్ర ఉన్నప్పుడు ఈ సమస్య రాదు.

కన్ను అదరడానికి ఒకవైపు పురాణాల్లో,  మరోవైపు సైన్స్ పరంగా కారణాలు ఎంటో తెలుసుకున్నారు కదా..  ఏదేమైనా కూడా మనం రోజు తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.. 

 

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Check for Health Problems with WalkingEye InfectionsEye TwitchHow to Care for EyesIntresting Fact about EyesLife styleTips of the Eyes
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.