అయోధ్య రామ మందిరం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరూ తమ ఆత్మగా భావించే చోటు. సుదీర్ఘకాలంపాటు కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఇటీవలే రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుపుకుంది. హిందూ భక్తుల కలల నిర్మాణమైన మందిర నిర్మాణానికి ఏర్పాటైన ప్రతిష్ఠాత్మకమైన కమిటీ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్. కేంద్ర ప్రభుత్వ పెద్దలు పేరెన్నికగన్న ప్రముఖులు కొలువుదీరిన ఈ ట్రస్ట్ కి సంబంధించిన సొమ్ములను కొంతమంది దుండగులు నకిలీ చెక్కులతో కాజేశారు.
తాజాగా ఈ విషయంపై ట్రస్ట్ సెక్రెటరీ చంపక్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కి సంబంధించిన సొమ్ములను నకిలీ చెక్కులతో 6 లక్షల రూపాయల వరకూ కాజేయడమే కాకుండా, మరొక 9 లక్షల రూపాయలకు నకిలీ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసిన సందర్భంలో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ట్రస్ట్ చైర్మన్ ను సంప్రదించగా తాము ఏ విధమైన చెక్కుని ఇష్యూ చేయలేదని ఆయన తెలిపిన సందర్భంలో అవి నకిలీ చెక్కులుగా తేలాయి. దీనిపై ట్రస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవి ట్రస్ట్ కు సంబంధించిన చెక్కులను క్లోనింగ్ చేసి నకిలీవి తయారు చేశారని తేలింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుగుతుంది. ఇదిలా ఉండగా ట్రస్టు లో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారం లేకుండా ఈ విధంగా జరగడం అసాధ్యం అనే విధమైన అభిప్రాయం కలుగుతుంది. మరి దోషులెవరనేది తెలాల్సి ఉంది.