Fan Makes virat kohli Potrait:విరాట్ బొమ్మ గీసిన అభిమాని.. దానిలో ప్రత్యేకత చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరంతే
కింగ్ కోహ్లీ…
ప్రపంచానికి పెద్దగా పరిచయమే అక్కర్లేని పేరు. క్రికెట్ రంగంలో మేరు నగ ధీరుడు.. రికార్థుల రారాజు.. రన్ మెషిన్ ఇలా అన్ని పేర్లకి ఆయనే రాజు. పైగా ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు ఫాలోయర్స్ ఉన్న క్రికెటర్ కింగ్ కోహ్లీనే.. ఇక విరాట్ కి సంబంధించిన వార్త ఏదైనా భయటికి వచ్చిందంటే అది ట్రెండ్ అవ్వాల్సిందే మరి.. అంతటి పాపులారిటీ & పాలోయింగ్ కోహ్లీకే సాధ్యం..ఇలా ఒక విషయం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది…
తాజాగా విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు, తన ఆరాధ్య క్రికెటర్ అయిన కోహ్లీని పోర్ట్రెయిట్ పెయింటింగ్ ను అద్భుతం గా వేశాడు.ఇందులో విశేషం ఏంటంటే,ఇది చూడడానికి మాములు ఫోటో అయినప్పటికీ, ప్రత్యేకంగా తదేకంగా పరిశీలిస్తే గానీ అది పెయింటింగ్ అని అర్ధం అవదు.దీనితో తమ అభిమాన ఆటగాడి పోర్ట్రెయిన్ పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు..