ఏపి సిఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో ఎనర్జీ సెక్టార్ మీద రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కి ఎనర్జీ మినిస్టర్ బాలినేను శ్రీనివాస్ రెడ్డి, సలహాదారులు మరియూ ఆఫీసర్లు హాజరయ్యారు.
జగన్ మాట్లాడుతూ.. “కొత్తగా ఏర్పాటుచేస్తున్న విద్యుత్ మీటర్ల మీద రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుల మధ్యకు వెళ్ళి అర్థం అయ్యేలా వివరించాలి. ఈ మీటర్లు వల్ల రైతులకి ఎలాంటి నష్టం కానీ అదనపు భారం కూడా పడదు అని పూర్తిగా మొత్తం సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తామని, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని చెప్పాలి. ఈ మీటర్లు ఏర్పాటు విద్యుత్ రీడింగ్ కోసం మరియూ ఫీడర్ల మీద లోడు తెలుసుకోవడానికి మాత్రమే అని వివరించాలి అని” విద్యుత్ అధికారులు ని ఆదేశించారు.
అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన మీటర్లు ప్రతీ 15 నిమిషాలకొకసారి రీడింగ్ నమోదు చేస్తాయని అధికారులు తెలిపారు.
సమావేశం లో సిఎం మాట్లాడుతూ, దీనికి సంబంధించిన పోస్టర్లు ప్రతీ గ్రామ పంచాయితీ మరియూ సచివాలయం లో ఉండాలని అధికారులని ఆదేశించారు. అలాగే రైతులకి పూర్తిగా అర్థం అయ్యేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనదే అని, గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సిఎం తెలిపారు. అలాగే రైతులు సాధ్యమైనంత వరకూ ISI మోటర్లు వాడేలా చూడాలని అధికారులని కోరారు.
కాగా, విద్యుత్ అధికారులు మాట్లాడుతూ 14,354 మంది లైన్ మెన్ లు దాదాపు 97.5% రైతులకి అహగాహన కల్పించారని, మిగిలిన రైతులకి నవంబర్ లోపు అవగాహన కల్పించే కార్యక్రమం పూర్తిచేస్తామని విద్యత్ అధికారులు సిఎం కి వివరించారు.
