విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ శనివారం రాంబిల్లి మండలం రాజాల గ్రామం ని సందర్శించారు. వరదల వల్ల నష్టపోయిన పంటలని పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు పంచాయితీ సెక్రటరీ ఆఫీసులో పెడతారని, త్వరలో అందరికి నష్టపరిహారం కూడా అందుతుంది అని హామీ ఇచ్చారు. అలాగే సంబందిత అధికారులు త్వరగా సర్వే నిర్వహించి నష్డపోయిన రైతుల లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు.
కాగా, శారదా నదికి మొన్నటి వర్షాలు వల్ల వరదలు వచ్చి పరిసరి ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్డపోయారు అని రైతులు గోడు వెల్లబుచ్చారు. అయితే దీనికి స్పందిస్తూ శారదా నదికి కాంక్రీటు పనులకి సంబందిచని అంచనాలు రెడీ చేస్తామని, ఈసారి వరదలు వచ్చినా రైతుల కి నష్టం లేకుండా పనులు పూర్తిచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.